ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్‌ కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి

Komatireddy vs Anil Kumar Reddy: తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు కుంభం పిలుపు

Update: 2023-07-24 10:31 GMT

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్‌ కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి

Komatireddy vs Anil Kumar Reddy: ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. తాజాగా భువనగిరి కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా మారింది. అనిల్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తన అనుచరులతో వలిగొండ, బీబీనగర్‌‌లలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.

కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ...భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి పై కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి‎పై తాడో పేడో తేల్చుకునేందకు సిద్ధం కావాలని సమావేశంలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Tags:    

Similar News