MP Arvind: సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. రాష్ట్ర పథకాల్లో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వానివే

MP Arvind: బీజేపీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

Update: 2023-01-30 13:30 GMT

MP Arvind: సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. రాష్ట్ర పథకాల్లో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వానివే

MP Arvind: బీజేపీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేటీఆర్ ఇందురుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నిజమాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వానివే అని తెలిపారు. కేంద్రం 17 ఇథనాల్ ప్లాంట్లను మంజూరు చేస్తే ఇప్పటివరకు ఒక్క ప్లాంట్‌ను కూడా ప్రారంభించలేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై కేసీఆర్‌కు సైంటిఫిక్ ధృక్పథం లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా ఇవ్వాలని కేటీఆర్ అడుగుతున్నాడని అర్వింద్ విమర్శించారు.

Tags:    

Similar News