Kavitha: శాసనమండలిలో కంటతడి పెట్టుకున్న కవిత..!

Kavitha: తెలంగాణ శాసనమండలి వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అత్యంత భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు.

Update: 2026-01-05 07:12 GMT

Kavitha: తెలంగాణ శాసనమండలి వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అత్యంత భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. తన రాజకీయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ ఆమె సభలోనే కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆంక్షల మధ్యే నా ప్రయాణం..

ప్రసంగం సందర్భంగా కవిత మాట్లాడుతూ.. "కేసీఆర్‌, ప్రొఫెసర్ జయశంకర్‌ గారి స్ఫూర్తితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే నాపై అనేక ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో నా గళాన్ని వినిపించినప్పుడు, ప్రశ్నించినప్పుడు నాపై కక్ష గట్టారు. సొంత పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి కూడా నేను అనేక కట్టుబాట్లు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీనామాను ఆమోదించండి..

గతేడాదే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేసిన కవిత, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి, నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కవిత చేసిన ఈ ఆకస్మిక ప్రకటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News