MLC Kavitha: హైదరాబాద్‌కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

Update: 2024-08-28 07:47 GMT
MLC Kavitha left for Hyderabad

MLC Kavitha: హైదరాబాద్‌కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత 

  • whatsapp icon

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అంతకంటే ముందుగా ఆమె ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. నేటి విచారణ ముగిసిన అనంతరం ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్‌కి ప్రయాణమయ్యారు.

ఐదున్నర నెలల తరువాత హైదరాబాద్ వస్తోన్న కవితకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటున్నాయి. సాయంత్రం కవిత శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ నుండి బయటికి రాగానే ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎయిర్ పోర్టు బయట ఆమె రాక కోసం వేచిచూస్తున్నారు.

శంషాబాద్ నుండి ఆమె నేరుగా తన నివాసానికి వెళ్లనున్నారు. ఇవాళ ఇక్కడే ఉన్న తన కుటుంబంతో సమయం గడిపిన తరువాత రేపు తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్‌కి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. 

Tags:    

Similar News