MLC Kavitha: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా..
MLC Kavitha: కవిత పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం
MLC Kavitha: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా..
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోర్టును కవిత కోరారు. వారి ఆరోపణలను సామాజిక మాధ్యమల నుంచి తొలగించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత.
ఉద్దేశ పూర్వకంగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిన తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరు, ప్రతిష్టను చెడగొట్టేందుకు అక్రమ పద్ధతును ఎంచుకున్నారని విమర్శించారు. ఇక నుంచి తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా.. పరవేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యేలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. కవిత పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.