MLC Kavitha: తెలంగాణకు ఏం చేస్తారో.. ఏం ఇచ్చారో మాత్రం చెప్పరు
MLC Kavitha: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు సాధ‌్యంకానివి
MLC Kavitha: తెలంగాణకు ఏం చేస్తారో.. ఏం ఇచ్చారో మాత్రం చెప్పరు
MLC Kavitha: తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఎన్నికలు రాగానే పొలిటికల్ టూరిస్టులు రాష్ట్రంలో పర్యటించి వెళ్తారని అన్నారు. ఎన్నికల వేళ ప్రతి ఒక్క పార్టీ వచ్చి వెళ్తుందని.. అయితే తెలంగాణకు ఏం చేస్తారో.. ఏం చేశారో మాత్రం చెప్పరని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆచరణకు సాధ‌్యం కానివని అన్నారు. రాహుల్ గాంధీని ఎలక్షన్ గాంధీగా అభివర్ణించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.