MLC Kavitha: అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన పార్టీ బీజేపీ
MLC Kavitha: బీజేపీ ఇచ్చిన 15 లక్షల రూపాయల హామీ ఏమయ్యింది
MLC Kavitha: అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన పార్టీ బీజేపీ
MLC Kavitha: BRS మేనిఫెస్టోపై BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించడాన్ని MLC కవిత తప్పు పట్టారు. BRS మేనిఫెస్టోను విమర్శించడంపై కిషన్‌రెడ్డికి అవగాహన లేదన్నారు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదని.. అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిన పార్టీ అని విమర్శల వర్షం గుప్పించారు. ఎవరి ఖాతాలో 15లక్షల రూపాయలు పడ్డాయి.. బీజేపీ చెప్పిన 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 2 లక్షల 21వేల ఉద్యోగ నియామకాలు జరిగాయని, ప్రైవేటు రంగంలో 30 లక్షల ఉద్యోగాలు నింపి యువతలో భరోసా నింపామన్నారు ఎమ్మెల్సీ కవిత. గత ఎన్నికల్లో బీజేపీ 109 చోట్ల డిపాజిట్ కోల్పోయింది.. ఈ సారి 119 చోట్లా డిపాజిట్ గల్లంతు అవుతుందని కవిత భవిష్యవాణి వినిపించారు.