మంత్రి ఈటెల రాజెంధర్ ను ముఖ్యమంత్రిని చేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Update: 2021-02-06 07:21 GMT

Representational Image

తెలంగాణ కాంగ్రెస్ లో అధికార పార్టీ అంశం కొత్త వివాదానికి దారి తీసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి ఈటెల రాజెంధర్ ను ముఖ్యమంత్రిని చేయాలని చేసిన వాఖ్యలు హస్తం పార్టీలో మరో డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చింది. బీసి నేతను సియం చేయాలని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో పిసిసిగా బీసి నాయకున్ని చేయాలనే డిమాండ్ ఎందుకు చేయరని కొందరు బీసి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు కొత్తేమి కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఏ నేత అయినా తనకు ఇష్టం వచ్చిన వాఖ్యలు చేస్తూ పార్టీలో కొత్త వివాదాలకు తెరలేపడం సర్వసాదరణం. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వాఖ్యలు సొంత పార్టీలో కొత్త డిమాండ్‌కు దారి తీసింది. అధికార పార్టీలో ముఖ్యమంత్రిని మారిస్తే సీఎం పదవిని కేటీఆర్‌కు కాకుండా బీసి అయినా మంత్రి ఈటెల రాజెంధర్‌ని ముఖ్యమంత్రి చేయాలన్నారు.

అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ చేస్తే ఇదే అంశం కాంగ్రెస్ పార్టీలో కొత్త డిమాండ్ కు తెరతీసింది. టీపీసీసీని బీసీ నేతకు ఇవ్వాలని జీవన్‌ రెడ్డి ఎందుకు డిమాండ్‌ చేయరని సొంత పార్టీ బీసీ నేతలు డిమాండ్‌ చేస్తు్న్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి అత్యధికంగా ఉన్నత కులాల నేతలే సారధ్యం వహించారు. ఇప్పుడు బీసి నేతలకు సారధ్య బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తంగా జీవన్ రెడ్డి అధికార పార్టీకి సెటైర్‌ వేస్తే సొంత పార్టీలో కొత్త డిమాండ్ రావడంతో కాంగ్రెస్‌ నేతలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. 

Tags:    

Similar News