Dasoju Sravan: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు దాసోజు శ్రవణ్‌ నామినేషన్‌.. ఎన్నిక లాంఛనమే..!

BRS MLC Candidate: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.

Update: 2025-03-10 01:37 GMT

Dasoju Sravan: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు దాసోజు శ్రవణ్‌ నామినేషన్‌.. ఎన్నిక లాంఛనమే..!

BRS MLC Candidate: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దాసోజు శ్రవణ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ తరపున శాసనసభలో 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో పది మంది కాంగ్రెస్‌లో చేరారు.

ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దాంతో దాసోజు శ్రవణ్ ఎన్నిక లాంఛనం కానుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌ను ప్రతిపాదించగా.. అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అవకాశం రావడంతో కేసీఆర్‌ ఆయనవైపు మొగ్గుచూపారు.

Tags:    

Similar News