Miss World 2025: బుద్ధవనానికి అందాల భామలు

Miss World 2025: హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే భామలు నేడు నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శించనున్నారు.

Update: 2025-05-12 06:09 GMT

Miss World 2025: బుద్ధవనానికి అందాల భామలు

Miss World 2025: హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే భామలు నేడు నాగార్జునసాగర్ బుద్ధవనం సందర్శించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాలకు చెందిన అందగత్తెలు మిస్‌వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటుండగా.. ఆసియా దేశాల నుంచి వచ్చినవారు మాత్రం బుద్ధవనం సందర్శనకు వెళ్లనున్నారు. బౌద్ధమతంపై విశ్వాసం, బుద్ధుని చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గల 30 దేశాలకు చెందిన మిస్‌వరల్డ్‌ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రత్యేకించి ఆయా దేశాల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి భారీ బందోబస్తు మధ్య పర్యాటక అభివృద్ధిసంస్థ ప్రత్యేక బస్సులో వీరిటి నాగార్జునసాగర్‌కు తీసుకువెళ్లనున్నారు. బుద్దవనంలో 24 మంది లంబాడా కళాకారులు వారికి లంబాడా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహాబోధి పూజలు నిర్వహించడం జరుగుతుంది. బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను సుందరిమనులు తిలకిస్తారు.

Tags:    

Similar News