Road Accident: తాండూరు పరిధిలో మరో బస్సు ప్రమాదం
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్నటి చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కరణ్‌కోట్ సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది.
గుల్బర్గా నుండి తాండూర్ కర్ణాటక ఆర్టీసీ బస్సు వెళ్తుండటంతో ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.