Uttam Kumar Reddy: పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్ వ్యాఖ్యలు
Uttam Kumar Reddy: పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టును అన్ని ఫోరమ్‌లలో మేం వ్యతిరేకిస్తున్నామని చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
Uttam Kumar Reddy: పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టును అన్ని ఫోరమ్‌లలో మేం వ్యతిరేకిస్తున్నామని చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని అన్నారు.
ఈ కేసును వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందన్నారు. ఈ కేసులో రిట్ పిటిషన్‌తో కాదు.. సూట్ పిటిషన్‌తో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందని ఉత్తమ్ తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును సుప్రీంను కోరుతామని ఆయ అన్నారు.