కబడ్డీ ఆడిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఎంపీ మాలోత్ కవిత...!
Minister Satyavathi Rathod: విద్యార్థులు క్రీడలతోపాటు చదువులోనూ రాణించాలి
Minister Satyavathi Rathod: ఓ వైపు మంత్రి మరో వైపు ఎంపీ ఇద్దరూ కలిసి కబడ్డీ ఆడితే ఆ ప్రాంగణమంతా సందడే సందడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఈ సందడి కనిపించింది. ఆటల పోటీలను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్న ఎంపీ మాలోతు కవిత కబడ్డీ ఆడి అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల కోసం గతంలో 30 ఉన్న గురుకులాలను 150 వరకు పెంచారన్నారు. ప్రతిరోజు గుడ్డుతో కూడిన పౌష్టికాహారం వారానికి నాలుగు సార్లు మాంసాహారం అందజేస్తున్నారని చెప్పారామె రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తు పెట్టుకొని విద్యార్థులంతా చదువుల్లో రాణించాలని ఆమె అభిలషించారు.