Minister KTR: మంత్రి కేటీఆర్ కు కరోనా

Minister KTR: కోవిడ్ టెస్టు చేయగా తనకు‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Update: 2021-04-23 04:45 GMT

Minister Ktr Tested Positive

Minister KTR: టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కేటీఆర్ తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ చర్యలకు ఉపక్రమించింది. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్​మెంట్​ జోన్లను బల్దియా ఏర్పాటు చేసింది. జంట నగరాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా చర్యల్లో భాగంగా ఈ మినీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో నిరంతరం శానిటైజేషన్​తో పాటు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక్క ఏరియా పరిధిలో 5 కేసుల కంటే ఎక్కువగా ఉంటే మినీ కంటైన్​మెంట్​ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్​లో కరోనా కేసులు వస్తే హౌజ్ క్లస్టర్లుగా బల్దియా ఏర్పాటు చేస్తోంది.


Tags:    

Similar News