KTR: షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు ఊరట.. రోడ్లు, అండర్ పాస్లు, ఫ్లై ఓవర్‌లను వేగంగా నిర్మిస్తున్నాం

Update: 2022-01-01 08:12 GMT

షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Shaikpet Flyover- KTR: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు. 333.55 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకీ రిలయన్స్ మార్ట్ నుంచి షేక్‌పేట్, రాయదుర్గం మల్కం వరకు 2.8 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న ఇది నగరంలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఒకటిగా నిలవనుంది. దీంతో మెహదీపట్నం - హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 

Tags:    

Similar News