KTR: మన దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి

KTR: అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్ వన్‌గా ఎదుగుతాం

Update: 2023-02-02 06:20 GMT

KTR: మన దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి

KTR:  మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతరాని అన్నారు. హైదరాబాద్‌లో NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన 'డీ- కోడ్ ది ప్యూచర్' అనే అంశంపై కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలునన్నారని.. అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదని చెప్పారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. దృష్టి అంతా ఎన్నికలపైనే ఉంటుందన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదే.. ఇతర దేశాల మదిరిగా భారత్‌లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే నంబర్ వన్‌గా ఎదుగుతమాని మంత్రి కేటీఆర్ అన్నారు.

Tags:    

Similar News