Harish Rao: జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని కోరిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: పలు అంశాలు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి హరీష్ రావు
Harish Rao: జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలని కోరిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ GST కౌన్సిల్ మీటింగ్‌లో తెలంగాణ మంత్రి హరీష్ రావు వర్చువల్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ఇరిగేషన్ పనులపై GST మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలపైనా GST మినహాయింపులు అడిగారు. బీడీ ఆకుపై ప్రస్తుతం ఉన్న 18 శాతం GSTపై మినహాయింపు కోరారు. టాక్స్ ఇన్ వాయిస్.. రూల్స్ సవరణ అశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి వెల్లడించారు.