Harish Rao: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్‌రావు విమర్శలు
Harish Rao: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.
ఈటెల రాజేందర్ పై విమర్శలు చేసిన హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)
Harish Rao: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. పేదల కోసం 4వేల ఇళ్లు ఇస్తే ఒక్క ఇల్లు కట్టివ్వని వ్యక్తి ఈటల అంటూ విమర్శించారు హరీష్‌రావు. మంత్రిగా ఉండి ఏం చేయని ఈటల.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కుట్టు మిషన్లు, సెల్‌ఫోన్లు, బొట్టు బిళ్లలతో ఓట్లు వేయాలని ఈటల రాజేందర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్న బీజేపీకి ఓటు ఎలా వేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ కావాలా..? ప్రాజెక్ట్‌లు కట్టి 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత కూడా హుజూరాబాద్‌లో తానే దగ్గరుండి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.