Mahbubnagar: మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై అలరించిన డ్రోన్ షో
Mahbubnagar: డ్రోన్ ప్రదర్శనను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
Mahbubnagar: మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై అలరించిన డ్రోన్ షో
Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్‌పై మెగా డ్రోన్ ప్రదర్శన అట్టహాసంగా సాగింది. డ్రోన్ షోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 450 డ్రోన్లతో అతి పెద్ద ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఒక్కసారిగా అన్ని డ్రోన్లు రంగురంగుల లైట్లతో మిరుమిట్లు గొలుపుతూ.. ఐలాండ్ మీది నుంచి గాలిలోకి లేచాయి. ముందుగా తెలంగాణ మరియు మహబూబ్‌నగర్ మ్యాప్, ఆ తర్వాత కోహినూర్ వజ్రం, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, పిల్లలమర్రి, సస్పెన్షన్ బ్రిడ్జ్, శిల్పారామం, ఐటీ టవర్, జోగులాంబ దేవాలయం, మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం కేసీఆర్, జై భారత్, జై తెలంగాణ, మన మహబూబ్‌నగర్‌ను 450 డ్రోన్లతో ప్రదర్శించారు. ఈ డ్రోన్ ప్రదర్శనను తిలకించేందుకు పిల్లా, పాప, పెద్ద, చిన్న తేడా లేకుండా వేలాది మంది ప్రజలు ట్యాంక్ బండ్ మీదకు తరలివచ్చారు. దీంతో.. ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది.