భూ తగాదాలో ట్విస్ట్.. రైతుకు గన్ చూపించి బెదిరింపులు..అది సిగరెట్ లైటర్‌ అని తేల్చిన పోలీసులు!

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్‌లో గన్‌తో బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

Update: 2025-11-06 07:06 GMT

మెదక్‌లో గన్ కలకలం.. గన్‌తో బెదిరిస్తే.. అది సిగరెట్ లైటర్‌ అని తేల్చిన పోలీసులు!

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్‌లో గన్‌తో బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే అది గన్ను కాదని... పిస్తోల్ ఆకారంలో ఉన్న సిగరేట్ లైటర్ అని పోలీసులు తేల్చారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హవేలీ ఘనపూర్‌కి చెందిన ఎల్లం అనే వ్యక్తికి హైదరాబాద్ వాసికి కొన్నేళ్లుగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో రైతు ఎల్లం నవంబర్ 1న కోర్టు నుంచి స్టే పొందాడు.

కాగా ఇవాళ ఉదయం పంట కోసుకునేందుకు మిషనరీతో పొలం వద్దక వెళ్లాడు. హైదరాబాద్‌కి చెందిన వ్యక్తికి మద్దతుగా హవేలి ఘనపూర్ మండలం నాగపురం గ్రామానికి చెందిన యోవన్ అనే వ్యక్తి పొలం వద్దకు వెళ్లి గన్ చూపించి బెదిరించాడు. భయభ్రాంతులకు గురైన రైతు ఎల్లం పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు బెదిరింపులకు గురి చేసిన వ్యక్తి వద్ద ఉన్న పిస్తోల్‌ను తీసుకొని గమనించగా అది సిగరేట్ వేలిగించే లైటర్‌గా గుర్తించారు. భయాందోళనకు గురి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ జార్జి తెలిపారు.

Tags:    

Similar News