రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్ట్.. హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు!!

Update: 2025-02-03 12:06 GMT

రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి అరెస్ట్.. హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు!!

Mastan Sai arrested in Lavanya, Raj Tarun case: రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తను కూడా మస్తాన్ సాయి బాధితురాలినే అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అందుకు సాక్ష్యంగా మస్తాన్ రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న కొన్ని వీడియోలను లావణ్య పోలీసులకు అందించారు.

గతంలో లావణ్య ఇచ్చిన ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసేందుకు యత్నించారు. కానీ అప్పటికే మస్తాన్ సాయి పరారైనట్లు తెలిసింది. అప్పటి నుండే ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

గతంలో గచ్చిబౌలిలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ ఘటన కేసులోనూ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకంటే ముందే ఏపీలోనూ ఓ డ్రగ్స్ కేసులో ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మస్తాన్ సాయి ల్యాప్ టాప్ లో 200 కుపైగా న్యూడ్ వీడియోలు 

మస్తాన్ సాయి షాపింగ్ చేస్తుండగా నార్సింగ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లోని ల్యాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని హార్డ్ డిస్కులో 200కు పైగా అమ్మాయిలు, మహిళల నగ్న వీడియోలు ఉన్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు.

Full View

ఆ వీడియోలు అడ్డం పెట్టుకునే మస్తాన్ సాయి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తూన్న ప్రధానమైన ఆరోపణ. మస్తాన్ సాయి తనను కూడా వీడియోలతో వేధించడం వల్లే రాజ్ తరుణ్‌కు, తనకు మధ్య విభేదాలు వచ్చాయని లావణ్య ఆరోపిస్తున్నారు. తామిద్దరం విడిపోవడానికి మస్తాన్ సాయి కూడా ఒక కారణంగా ఆమె చెప్పుకొస్తున్నారు. 

Tags:    

Similar News