జై తెలంగాణ అంటూ.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Update: 2020-09-10 07:51 GMT

హైదరాబాద్ రవీంద్రభారతి ఎదుట ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా ఉద్యోగం పోయిందని మనస్తాపం చెంది పెట్రోల్‌ పోసుకొని ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జై తెలంగాణ అంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ వచ్చినా తనకు న్యాయం జరగలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ' నినాదాలు చేశాడు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడ్డాడు.

బాధితుడు మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ వాసిగా గుర్తించారు. అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. అయితే కరోనా కారణంగా పెట్టిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు. దాంతో కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి దొరకకపోవడంతో విసుగుచెందిన నాగులు రవీంద్రభారతి వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.





Tags:    

Similar News