సైబరాబాద్, రాచకొండ పోలీసు వెబ్‌సైట్లలో మాల్‌వేర్ అనుమానం
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్‌సైట్లు గత వారం రోజులుగా పూర్తిగా పనిచేయడం లేదు. ఈ వ్యవస్థలోకి మాల్‌వేర్ చొరబడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

వెబ్‌సైట్లను ఓపెన్ చేయగానే గేమింగ్ అప్లికేషన్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్లు ఐటీ బృందాలు గుర్తించాయి. వెంటనే సర్వర్లను డౌన్ చేసి, వాటిని నిర్వహిస్తున్న ఎన్‌ఐసీకి సమాచారం అందించారు.
సమస్యను పరిష్కరించేందుకు రెండు కమిషనరేట్ల ఐటీ టీములు పనిచేస్తున్నాయి. ఎన్‌ఐసీ పర్యవేక్షణలో వెబ్‌సైట్లను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది.
అదే సమయంలో, మళ్లీ హ్యాకింగ్ జరగకుండా చూడటానికి అధునాతన ఫైర్‌వాల్స్, సెక్యూరిటీ లేయర్లను ఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, భద్రతా ప్యాచ్‌లు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.