Rabies Vaccine: జ్వరం అని ఆస్పత్రికి వెళ్తే రేబిస్ టీకా వేసిన నర్సు
Mahabubnagar Hospital Negligence: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే రేబిస్ టీకా వేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వాస్పత్రిలో జరిగింది.
Mahabubnagar Hospital Negligence: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్తే రేబిస్ టీకా వేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. దేవరకద్ర మండలం బల్సుపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి జ్వరం వచ్చింది. ఐదు రోజుల క్రితం దేవరకద్ర ఆస్పత్రికి చూపించుకోవడానికి వెళ్లాడు. డాక్టర్ శరత్‌చంద్ర... నాగరాజును పరిశీలించి ప్రతి రోజు ఇంజక్షన్లు వేసుకోవాలని చెప్పి చీటీపై రాసిచ్చాడు.
ANM విజయ కుమారి... అతనికి రేబిస్ టీకా వేసింది. పక్కనే ఉన్న మరో నర్సు అతడికి జ్వరం వచ్చిందని కుక్క కాటుకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పింది. రేబిస్ టీకా వేసిందని డాక్టర్ శరత్ చంద్ర దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయగా పొరపాటున జరిగిందని... ఏమీ కాదులే అని అతడిని పంపించి వేశారు. రేబిస్ టీకా వేయడం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.