ఈరోజు నుంచి తెలంగాణాలో తెరుచుకోనున్న వైన్ షాపులు : నిబంధనలు ఇవే!
తెలంగాణా ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో వైన్ షాపుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు పలు నిబంధనలను ప్రభుత్వం పొందు పరిచింది.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈరోజు నుంచి మద్యం అమ్మకాలను తెలంగాణా ప్రభుత్వం ప్రారంభిస్తుందని నిన్నరాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపద్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణా ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో వైన్ షాపుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు పలు నిబంధనలను ప్రభుత్వం పొందు పరిచింది. దీని ప్రకారం..
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వైన్ షాపులు తెరిచి ఉంచాలి.
- బార్లు, పర్మిట్ రూంలు, రెస్టారెంట్లకు అనుమతి ఉండదు.
- ప్రతి మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించాల్సిందే.
- ప్రతి మద్యం దుకాణం వద్ద భౌతిక దూరం పాటించాలనీ, మాస్క్ లు విధిగా ధరించాలనీ బోర్డులు పెట్టాలి.
- వైన్స్ షాపుల వద్ద ఆరు అడుగుల దూరంతో సర్కిల్స్ మార్క్ చేయాలి.
- వైన్ షాపుల యజమానులు, వర్కర్ లు విధిగా మాస్క్ లు ధరించాలి.
- పబ్లిక్ ప్లేసులలో ఎట్టిపరిస్తితుల్ల్లోనూ మద్యం సేవించకూడదు.