ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కొమ్రుం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం రేగింది.

Update: 2025-12-17 06:58 GMT

ఓటమి భయం.. ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్ అభ్యర్థి

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కొమ్రుం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం రేగింది. రాస్పెల్లి గ్రామ బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అభ్యర్థి రాజయ్య.. ఓటమి భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. వేరే పార్టీల అభ్యర్థులు డబ్బులు పంచారని, తన దగ్గర డబ్బుల్లేకపోవడంతో తనకు ఎవరూ ఓటు వేయరని భావించిన రాజయ్య.. పురుగులమందు తాగి సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాడు. ఇది గమనించిన స్థానికులు.. రాజయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News