Telangana Panchayat Elections 2025: తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు.. ప్రశాంతంగా ముగిసిన చివరి విడత పోలింగ్‌

Telangana Panchayat Elections 2025: తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

Update: 2025-12-17 07:35 GMT

Telangana Panchayat Elections 2025: తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా.. రాష్ట్ర వ్యాప్తంగా చివరి విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల వరకు 57.91 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్‌ పర్సంటేజీ మరింత పెరగనుంది. ఇదిలా ఉంటే.. కాసేపట్లో చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇక.. ఇవాళ జరిగిన చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 3వేల 752 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ సర్పంచ్‌ ఎన్నికల్లో 12వేల 640 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అలాగే.. మొత్తం 28 వేల 406 వార్డులకు ఎన్నికలు జరగగా.. 75వేల 283 మంది బరిలో నిలిచారు. ఇక.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి.. కాసేపట్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో గెలుపోటములపై అటు అభ్యర్థుల్లోనూ.. ఇటు పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News