Droupadi Murmu: ఇవాళ హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: శీతాకాల విడిదిలో భాగంగా.. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Droupadi Murmu: ఇవాళ హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: శీతాకాల విడిదిలో భాగంగా.. ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు హకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి.. విశ్రాంతి తీసుకుంటారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఐదురోజుల పాటు బస చేయనున్న రాష్ట్రపతి.. నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ నెల 19న రామోజీ ఫిల్మ్‌సిటీకి రాష్ట్రపతి ముర్ము వెళ్తారు. ఆలిండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభిస్తారు. ఇక.. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో జరిగే సదస్సుకు హాజరవుతారు ముర్ము. ఆ తర్వాత ఈ నెల 21న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు.
మరోవైపు.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. బొల్లారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎగురవేతపై నిషేధం విధించారు.