Droupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Droupadi Murmu: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. హకీంపేట వాయుసేన విమానాశ్రయంలో దిగిన ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆమె ఇక్కడే బస చేసి, నగరంలో జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.