Telangana Panchayat Election Results: కొనసాగుతున్న కౌంటింగ్‌.. సాయంత్రంలోపు ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. కీలక ఘట్టమైన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Update: 2025-12-17 08:52 GMT

Telangana Panchayat Election Results: కొనసాగుతున్న కౌంటింగ్‌.. సాయంత్రంలోపు ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక.. కీలక ఘట్టమైన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రంలోపు ఫలితాలను వెల్లడించనుంది ఈసీ. చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 3వేల 752 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ సర్పంచ్‌ ఎన్నికల్లో 12వేల 640 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

అలాగే.. మొత్తం 28 వేల 406 వార్డులకు ఎన్నికలు జరగగా.. 75వేల 283 మంది బరిలో నిలిచారు. ఇక.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి.. పోటీలో నిలిచివారితో పాటు.. పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

Tags:    

Similar News