Vemula Prashanth Reddy: ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Update: 2025-12-17 07:30 GMT

Vemula Prashanth Reddy: ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలి

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తులనే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "ప్రజల కోసం నిరంతరం పనిచేసే వారు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే వారినే ఓటర్లు ఎన్నుకోవాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. చదువుకున్న వారు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి గ్రామాల భవిష్యత్తును నిర్ణయించాలని ఆయన ఆకాంక్షించారు. చివరి విడత కావడంతో జిల్లావ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

Tags:    

Similar News