MLAs Disqualification: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ స్పీకర్ నిర్ణయం
MLAs Disqualification: ఐదుగురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు.
MLAs Disqualification: ఐదుగురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకోనున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహా ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిల పిటిషన్లపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తోంది.
ఈ నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్నారు స్పీకర్. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్.. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో వీరిద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.