Liquor Sales in Hyderabad: హైదరాబాద్ చరిత్రలో తొలిసారి.. డిసెంబర్‌లో రూ.5,100 కోట్ల మద్యం అమ్మకాలు

Liquor Sales in Hyderabad: ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 2025 డిసెంబర్ నెలలో భాగ్యనగర చరిత్రలోనే తొలిసారిగా రూ.5,100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

Update: 2026-01-01 10:19 GMT

Liquor Sales in Hyderabad: హైదరాబాద్ చరిత్రలో తొలిసారి.. డిసెంబర్‌లో రూ.5,100 కోట్ల మద్యం అమ్మకాలు

Liquor Sales in Hyderabad: తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 2025 డిసెంబర్ నెలలో భాగ్యనగర చరిత్రలోనే తొలిసారిగా రూ.5,100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 30న దాదాపు రూ.375 కోట్లు, డిసెంబర్ 31న ఒక్క రాత్రిలోనే రూ.350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లోనే మొత్తం రూ.750 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

గత రికార్డు బ్రేక్

2025 డిసెంబర్ నెలలో చివరి ఐదు రోజుల్లోనే రూ.1,344 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. ఒకే నెలలో రూ.5 వేల కోట్లకు పైగా అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. 2023 డిసెంబర్‌లో నమోదైన రూ.4,300 కోట్ల రికార్డును ఈసారి బ్రేక్ చేసినట్లు వెల్లడించారు.

అమ్మకాలు పెరగడానికి కారణాలు

డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. అదనంగా కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో విభిన్నమైన బ్రాండ్లు, ఫ్లేవర్లు అందుబాటులో ఉంచడం కూడా అమ్మకాలను పెంచింది.

న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, రాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇవ్వడం కూడా అమ్మకాలకు దోహదం చేసింది.

బీర్ అమ్మకాలు కూడా జోరు

చలి ఉన్నప్పటికీ బీర్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాలంలో 5.89 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే మొత్తం మద్యం అమ్మకాలు 107 శాతం పెరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించిందని, కొత్తగా ప్రారంభమైన దుకాణాల యజమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News