Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో చిరుత పులి సంచారం
Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో నెల రోజులుగా చిరుత పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో నెల రోజులుగా చిరుత పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అధికారులు, ప్రజలు కళ్లు కప్పి చిరుతపులి రోజుకో ప్రదేశంలో సంచరిస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల దోస్త్ పల్లి శివారులో ఓ పులి మృతి చెందింది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఓ చిరుత పులి బంగారు పల్లి, డోన్ గావ్, మైబపూర్, శక్తినగర్, పెద్దఎడ్గి గ్రామ శివారులో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సంచరిస్తున్న చిరుత పులి రెండు పిల్ల కూనలు వెంట పెట్టుకొని తిరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. రైతులు, పశుకాపరులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.