Satyavathi Rathod: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్
Satyavathi Rathod: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Satyavathi Rathod: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా కురవి మండలలో అన్న దాన కార్యక్రమం నిర్వహించేందుకు తన నివాసం నుండీ బయలుదేరుతున్న సత్యవతి రాథోడ్‌ను పోలిసులు అడ్డుకున్నారు. తోరూరులో బీఆర్‌ఏస్ నేతలు బారి ధర్నా కార్యక్రమం నిర్వహించనుండటంతో సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలిసులు తెలిపారు.
ధర్నాలో పాల్గొనకుండానే అరెస్ట్ చేయడం దారుణమని సత్యవతి అన్నారు. ధర్నా అనే సాకుతో తనను కేసీఆర్ జన్మదిన వేడుకలకు వెళ్లకుండా అరెస్ట్ చేయడం సరికాదని, వెంటనె తనన్ను విడుదల చేయాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.