రాజేంద్రనగర్ లో మ‌రోసారి చిరుత క‌ల‌క‌లం

Update: 2020-10-10 06:54 GMT

గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులులు అక్కడక్కడా జనావాసంలోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివార్లలోని ప్రజలను చిరుతపులి మరోసారి భయాందోళనకు గురిచేసింది. రెండు నెలల క్రితం నగర శివార్లలో దర్శనం ఇచ్చిన చిరుతపులి మరో సారి కనిపించి క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలో చిరుత సంచ‌రిస్తున్న‌ది. శుక్రవారం అర్ధ‌రాత్రి సమయంలో చిరుతపులి రెండు లేగ దూడ‌ల‌ను చంపిన‌ట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయగా వారు వెంటనే అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పుటి జాడలను వెతికారు. ఆ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. దీంతో స్థానికులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గత ఆగ‌స్టులో కూడా రాజేంద్ర‌న‌గ‌ర్‌లో చిరుత సంచ‌రించింది. హిమాయ‌త్‌సాగ‌ర్ వాలంత‌రీ రిసెర్చ్ ఫ్యూమ్ హౌస్ వ‌ద్ద ఆవుల‌పై ఆగ‌స్టు 26న దాడిచేసింది. అప్పుడు కూడా పులి ఓ ఆవుదూడ‌ను చంపి తిన్న‌ట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యింది. అదే విధంగా అగస్టు 27వ తేదీన కూడా చిరుత కదలికలు ఆనవాళ్ళు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యియి. గతంలో చిరుత సంచారం నేపధ్యంలో అటవీశాఖ అధికారులు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. చనిపోయిన దూడ మృతదేహాన్ని కొంతదూరం లకెళ్లిన చిరుత విజువల్స్ కెమెరాలో రికార్డు ఐయ్యాయి. అప్పుడు కూడా చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసారని సమాచారం.Leopard Hulchal in Rajendernagar Hyderabad and People are in Panic

https://www.hmtvlive.com/telangana/leopard-hulchal-in-rajendernagar-hyderabad-and-people-are-in-panic-51867

Tags:    

Similar News