Leopard wandering in Warangal : వరంగల్‌లో చిరుత..వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ

ప్రతీకాత్మక చిత్రం
Leopard wandering in Warangal : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులులు అక్కడక్కడా జనావాసంలోకి...
Leopard wandering in Warangal : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులులు అక్కడక్కడా జనావాసంలోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న మంచిర్యాల, కొమురంభీం, జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో ఓ జంతువు ఆయా ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి చేస్తుంది. సీతంపేట గ్రామ పంచాయతీ నర్సరీ నిర్వాహకుడు నర్సరీ సరిసరాల్లో ఆ జంతువుని చూసాడని, ముందుగా ఏదో జంతువుగా భావించాడని తెలిపారు. అది జంతువు ఎంతకీ అక్కడి నుంచి వెల్లకపోవడంతో కర్ర తీసుకుని వెళ్లేగొట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి ఆ జంతువలు పులిలా శబ్దం చేయడంతో కొంత వెనక్కి తగ్గాడు.
దీంతో భయాందోళకు చెందిన నర్సరీ నిర్వహకుడు, అలాగే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎల్కతుర్తి ఫారెస్ట్ రేంజర్ సందీప్, సెక్షన్ ఆఫీసర్లు హుస్సేన్, రమేష్, ముజీబ్ ఆ జంతువు తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తరువాత వీడియో క్లిపింగ్‌లు, పాద ముద్రలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలకు షాకింగ్ నిజాన్ని తెలిపారు. అవి పెద్ద పులివి కావని తేల్చి చెప్పారు. చిరుతపులి పిల్ల, లిపోడి క్యాట్‌గా అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలెవరూ వేటకు వెళ్లొద్దని ఒకవేళ చిరుత పిల్ల పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని అధికారులు తెలిపారు. లేదంటే తిమ్మాపురం, గంటూరుపల్లి వైపునకు వెళ్లే అవకాశాలున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒక వేళ ఆకస్మాత్తుగా చిరుత పిల్లను వేటాడినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ రేంజర్ సందీప్ హెచ్చరించారు.