చెట్టు తొర్రలో కనిపించిన చిరుత పిల్ల.. భయాందోళనల్లో గ్రామస్తులు

Update: 2020-03-09 07:17 GMT
చెట్టు తొర్రలో కనిపించిన చిరుత పిల్ల.. భయాందోళనల్లో గ్రామస్తులు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీ పేట అటవీ ప్రాంతంలో ఓ చిరుత కూన కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ చెట్టు తొర్రలో చిరుత కూనను గ్రామస్తులు కనుగొన్నారు. గత కొద్దిరోజులుగా చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో ఇప్పటికే భయాందోళనలో ఉన్న గ్రామస్తులకు చిరుత పిల్ల కనిపించడం మరింత భయానికి గురిచేస్తుంది. మరోవైపు గ్రామస్తుల సమాచారంతో చేరుకున్న అటవీ అధికారులు చిరుత కూనను జూకు తరలించారు. అలాగే ఆ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేశారు.

అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాలకు వెళ్లాలంటే స్థానికులు భయపడుతున్నారు. అంతేకాకుండా పంట పొలాలకు వెళ్లినప్పుడు ఎప్పుడు ఏ చిరుత వచ్చి మీద పడుతుందో అని వణికిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇటు అటవీ అధికారులు కూడా చిరుత సంచారంపై సమాచారం సేకరిస్తున్నారు.


Full View

 

Tags:    

Similar News