Lakshmi Parvati: నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు

Lakshmi Parvathi: 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు.

Update: 2025-01-18 04:53 GMT

Lakshmi Parvati: నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు

Lakshmi Parvathi: 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గౌరవం కాపాడే విధంగా బతుకుతున్నానని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నా.. నందమూరి కుటుంబసభ్యురాలుగా చూడటం లేదని ఆవదన వ్యక్తం చేశారు.

గత 30 ఏళ్లుగా నాపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని..ఇప్పటికి కూడా అవే అబద్ధాలు ఆడుతూ నా జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి వాపోయారు. తనపై ఎందుకు కక్ష.. తానేమి తప్పు చేశానో అర్దం కావడం లేదన్నారు. తనపై జరుగుతున్న వేధింపులపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలన్నారు. 

ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరు తెలుగు వాడినని చెప్పుకునే దైర్యం కల్పించారని హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టి పేదవారి ఆకలి తీర్చారన్నారు. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శమని, అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారారని కొనియాడారు. రాజకీయంగా స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకు వచ్చిన ఎన్నో పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. 

Tags:    

Similar News