KTR: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు

KTR: అణచివేస్తే మౌనంగా ఉండే ప్రసక్తే లేదు

Update: 2023-09-26 03:29 GMT

KTR: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు

KTR: డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. దేశంలో ఉత్తమ పనితీరు కనబరుస్తోన్న దక్షిణాది రాష్ట్రాలను అణచివేయాని చూస్తే సహించబోమన్నారు. డీలిమిటేషన్‌తో సీట్లు తగ్గితే దక్షిణాదిలో ప్రజా ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని.. మౌనంగా ఉండే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు కేటీఆర్. డీ లిమిటేషన్ చేపడితే.. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను నిర్ణయిస్తారు.

అయితే ఈ డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతుందనే ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను వింటుందని.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక కేటీఆర్‌ ట్వీట్‌ను సపోర్ట్ చేస్తూ ఎంపీ అసదుద్దీన్‌ కూడా స్పందించారు.

Tags:    

Similar News