వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరం: కేటీఆర్

నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2020-03-14 08:38 GMT
KTR Speech in Wings India

నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సు మూడో రోజుకు చేరుకుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన చాలా మంది విదేశీలయులు ఈ సదస్సుకు హాజరుకాకపోయినప్పటికీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) దీన్ని నిర్వహిస్తుంది. ఎఫ్‌ఐసీసీఐ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన వింగ్స్‌ ఇండియా-2020 ప్రదర్శనకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఏవియేషన్‌ రంగం 14 శాతం వృద్ధితో ఎదుగుతోందని ఆయన చెప్పారు. నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. రీజినల్‌ కనెక్టివిటీ కోసమే పాత విమానాశ్రయాల పునరుద్దరణ అని ఆయన పేర్కొన్నారు.

వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 2,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అవసరమున్నాయని తెలిపారు. విమానాశ్రయాలతో పాటు హెలిపోర్ట్స్‌, సీ ప్లేన్‌లపై రాష్ట్రం ఆసక్తిగా ఉందన్నారు. ఏవియేషన్‌ రంగంపై జీఎస్టీ తగ్గించేందుకు విధానపర నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.


Tags:    

Similar News