KTR: తెలంగాణకు మోడీ చేసింది గుండు సున్నా
KTR: దేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు
KTR: తెలంగాణకు మోడీ చేసింది గుండు సున్నా
KTR: తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోడీ వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. దేశం మొత్తంలో 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. తెలంగాణకు మోడీ చేసింది గుండు సున్నా అంటూ మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా.. ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.