KTR: పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.

KTR: ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దు

Update: 2023-09-21 09:44 GMT

KTR: పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.

KTR: వేరే పార్టీలు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండంగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఆ విషయాలు తొందరలోనే సీఎం కేసీఆర్ చెబుతారని అన్నారు. తొమ్మిదేళ్లలో అభివృద్ధి , సంక్షేమం జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తుందని చెప్పారు. అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు ... వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొందరు వస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌‌లో రెండో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

Tags:    

Similar News