KTR: కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్
KTR: ఫిబ్రవరిలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు
KTR: కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్
KTR: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న అసెంబ్లీలో తమ పోరాట పటిమ చూశారన్న కేటీఆర్.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించండని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్న ప్రతిపక్షంలో ఉంటేనే ఎదుర్కోవడం కష్టమని అన్నారు. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్‌ఫుల్ అన్న కేటీఆర్.. ఫిబ్రవరిలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని.. ప్రతి రెండు, మూడు నెలలకోసారి కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ సీటు ఖచ్చితంగా గెలవాలని కార్యకర్తలకు తెలిపారు.