KTR: బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి.. కరీంనగర్ లో ఒక్క రూపాయి పనిచేయలేదు

KTR: ఒక్క కొత్త విద్యాసంస్థను కూడా సిటీకి తీసుకురాలేదు

Update: 2023-10-18 08:08 GMT

KTR: బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి.. కరీంనగర్ లో ఒక్క రూపాయి పనిచేయలేదు

KTR: కరీంనగర్ లో మతం పేరిట చిచ్చు పెట్టే వ్యక్తులు ఉన్నారంటూ బండి సంజయ్ పై పరోక్ష విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి కరీంనగర్ పట్టణానికి ఒక్క రూపాయి పని చేయలేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. ఒక్క కొత్త విద్యా సంస్థ కూడా తీసుకురాలేదని అన్నారు. మాట్లాడితే మోడీ దేవుడన్నా.. అనే బండి సంజయ్ ఎవరికి దేవుడని ప్రశ్నించారు కేటీఆర్. 400 రూపాయలున్నా గ్యాస్ సిలిండర్ ను పదకొండు వందలు చేసినందుకు మహిళలకు దేవుడా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News