KTR: చెరువుల సంక్షరణకోసం.. పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి

KTR: దుర్గం చెరువు టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది

Update: 2023-03-28 08:09 GMT

KTR: చెరువుల సంక్షరణకోసం.. పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి

KTR: సీఎస్ఆర్ నిధులతో హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 25, హెచ్‌ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్ గా మారిందని.. మరో 50 చెరువుల అభివృద్దికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో చెరువుల బ్యూటిఫికేషన్, వాటి సంరక్షణ కోసం పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News