కోనేరు కృష్ణ అరాచకాలపై వెలుగుచూసిన మరో వీడియో

Update: 2019-07-03 09:26 GMT

తానెలాంటి దాడులకు పాల్పడలేదని ఎవరినీ గాయపర్చలేదని ముందునుంచీ చెప్పుకొచ్చిన కోనేరు కృష్ణ అసలు రంగు బయటపడింది. అనితపై తన అనుచరులు దాడి చేశారని తాను మాత్రం దాడికి పాల్పడలేదని అమాయకత్వాన్ని నటించిన కోనేరు కృష్ణ అరాచకాలు అనితపై దాడికి ముందే ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిణి అనితపై దాడి చేసిన కోనేరు కృష్ణ అంతకుముందు అరెస్ట్‌ చేసిన రైతులను బలవంతంగా విడిపించుకుపోయారు. పోలీసులను నెట్టేసి లోపలున్న వారిని బయటకు తీసుకొచ్చాడు. స్థానికులతో కలిసి కర్రలు చేతబట్టుకుని కోనేరు కృష్ణ స్వైరవిహారం చేశారు. భారీ కర్రతో గిరిజనులతో కలిసి తీవ్రంగా ఫారెస్ట్‌ ఆఫీసర్‌ను చికతబాదాడు. ఇంతలా జరుగుతున్న పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు. అతడిని అడ్డుకునే సాహసం చేయలేకపోయారు.

Full View

  

Tags:    

Similar News