Kishan Reddy: బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తలిపిన బీజేపీ నాయకులు

Update: 2023-07-21 08:39 GMT

Kishan Reddy: బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: బీజేపీ స్టేట్ చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బీజేపీ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి అరవింద్, మాజీ ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. అంతకుముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరంఅంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags:    

Similar News