Kishan Reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
Kishan Reddy: telugu news, latest telugu news, తెలుగు వార్తలు, తెలుగు తాజా వార్తలు
Kishan Reddy: పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
Kishan Reddy: దేశ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలతో పాటు... దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద శ్రీశైలం దేవస్థానంతో పాటు సింహాచలం, అన్నవరం ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆలయాల అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.