Kishan Reddy: అందుకే బీజేపీ, వైఎస్ షర్మిల యాత్రలను అడ్డుకుంటున్నారు
Kishan Reddy: బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలనుకుంటే జైళ్లు సరిపోవు
Kishan Reddy: అందుకే బీజేపీ, వైఎస్ షర్మిల యాత్రలను అడ్డుకుంటున్నారు
Kishan Reddy: తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ పోరాటం సాగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భైంసాలో నిర్వహించిన బండిసంజయ్ ప్రజాసంగ్రామ యాత్రసభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ద పాలన సాగడం లేదన్నారు. వరంగల్ లో షర్మిల యాత్రను అడ్డుకోవడమే అందుకు నిదర్శనం అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా ఓ ఆడబిడ్డ యాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని అరాచకం సృష్టించినా.. పోలీసులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇక బీఆర్ఎస్ పెడతా ప్రధాని మోడీని ఓడిస్తాననంటున్న కేసీఆర్.. ఆ సమయానికి ఫామ్‌హౌజ్‌లో ఉంటారని సెటైర్ వేశారు.